బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
టీ.యూ.డబ్ల్యూ.జే (హెచ్-143) తంగళ్ళపల్లి మండల కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీ.యూ.డబ్ల్యూ.జే (హెచ్-143) జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా తెలిపారు. మండల అధ్యక్షుడిగా వెంగళ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా గాదగోని సాగర్,ప్రధాన కార్యదర్శిగా జలగం అనిల్ కుమార్, కోశాధికారిగా కలకుంట్ల శ్రీనాథ్ రావు,సహాయ కార్యదర్శిగా రెడ్డి మల్ల దేవరాజు,సాంస్కృతిక కార్యదర్శిగా మామిడి శెట్టి దినేశ్,ముఖ్య సలహాదారులుగా అందె దేవేందర్,సామల గట్టు ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా ఉంటామని త్వరలోనే ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తానని,యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షుడిని, ప్రధాన కార్యదర్శిని ఘనంగా సన్మానించారు. ఇందులో దుబ్బాక రాజు, కాళికోట చందు, గ్యాదనవేని మధు,రెడ్డి రాజశేఖర్, చెరుకుపల్లి రాకేష్ పాల్గొన్నారు.