-స్వయం ఉపాధి కోసం కొత్త పథకాలతో రుణాలు
-నాప్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు
బలగం టీవి ,గంభీరావుపేట:
స్వయం ఉపాధి కోసం కెడిసిసి బ్యాంకు ద్వారా అందిస్తున్న రుణాలను యువత సద్వినియోగం చేసుకోవాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సముద్రలింగాపూర్ కు చెందిన సుధు
మాల మహేందర్ కీ రూ.9 లక్షలా 24 వేలు రుణంతో మంజూరైన కారు (స్విఫ్ట్)ను కొండూరి రవీందర్ రావు అందజేశారు. ఈ సందర్బంగా రవీందర్ రావు మాట్లాడుతూ స్వయం ఉపాధితో తీసుకున్న రుణాన్ని సకాలంలో బ్యాంకుకు చెల్లించాలని అన్నారు. సహకార బ్యాంకు ద్వారా కొత్త రుణాలు అందిస్తున్నామని అన్నారు.కార్పొరేట్ బ్యాంకుల సహకారంతో విద్య, గృహ, పాడిపరిశ్రమ, పార్టీ, చిన్నతరహా పరిశ్రమలతోపాటు వాహనాలకు రుణాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ డ్డి, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి, నర్మల సర్పంచ్ రాజు, సింగల్ ఫ్రిండ్ వైస్ చైర్మన్ రామాంజనేయులు గౌడ్,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, ప్యాక్స్ ఉద్యోగులు సత్యం రావు, రాజిరెడ్డి నాయకులు రాజారాం,రాజేందర్,స్వామి తదితరులు పాల్గొన్నారు.