బలగం టీవి,, గంభీరావుపేట :
- కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్.
నేత కార్మికులకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని,అధికారంలోకి వచ్చిన నెలలోపే చేనేత కార్మికుల కోసం 200 కోట్లును విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హమీద్ మాట్లాడుతూ
గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నేత కార్మికులకు ఎంపీ బండి సంజయ్ చేసింది ఏమీ లేదు అని అన్నారు. నేత కార్మికుల సమస్యలపై ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారా అని ప్రశ్నించారు. పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేసినారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల నేత కార్మికుల దుస్థితిని అప్పటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అనేక పరిశ్రమలు తీసుకువచ్చారని అన్నారు. ఎంపీ బండి సంజయ్ వెంటనే స్పందించి నేత కార్మికుల సమస్యలపై నేత కార్మికుల బృందాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి,నూలు వస్త్ర పరిశ్రమపై వేస్తున్న పన్నును రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు చేసింది ఏమీ లేదని, వారి సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పుడు చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్నదని ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేటీఆర్ ఆనాడు సర్పంచ్ ల సమస్యలను పట్టించుకోలేదని, కనీసం వారిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, ఈనాడు సర్పంచుల సమస్యలపై పోరాడుతానడం హాస్యాస్పదమని అన్నారు. కాంగ్రెస్ లోకి సర్పంచులు పోతారని సమాచారంతోనే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసి అండగా ఉంటానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. చేనేత కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, దమ్ము శ్రీనివాస్ రెడ్డి, భూమరాజాం , తాజద్దిన్, గంగి స్వామి, రాజ్ వీరు,రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.