బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వేములవాడ ASP & సిరిసిల్ల ఇంన్చార్జి SDPO శేషాద్రిని రెడ్డి IPS.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వేములవాడ ఏఎస్పీ సిరిసిల్ల ఇంన్చార్జి ఎస్ డీపీవో శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో తనిఖీ చేసి స్టేషన్ రికార్డులను పరిశీలించి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు,రికార్డులను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న దొంగతనాలు, గంజాయి,స్మగ్లింగ్,రేషన్ బియ్యం,ఇసుక అక్రమ రవాణా మరియు ఇతర కేసుల గురించి వివరాలు తెలుసుకొని వాటి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని, రంజాన్ పండుగ సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ రామ్మోహన్ కి మరియు సిబ్బందికి తెలిపారు.