టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమం..

0
174

తేమడ నమూనాలను సేకరించి వేములవాడ ఏరియా ఎక్స్రే ల్యాబ్ కు పంపించాము

  • మెడికల్ అధికారి రేణు ప్రియ

బలగం టీవీ, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మానువాడ గ్రామంలో టీబీ వ్యాధిపై అవగాహనను టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మెడికల్ ఆఫీసర్ రేణుప్రియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో జయశీల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం రేణుప్రియ మాట్లాడుతూ.. టీబీ ముక్త్ భారత్ అభియాన్ నిర్వహించిన కార్యక్రమంలో బీపీ, షుగర్, ఆర్.బి.ఎస్, హెచ్ఐవి, హెచ్.బి.ఎస్.ఏ.జీ, ఆర్.డి.టి, దీర్ఘకాలిక సమస్యలకు సంబంధించిన పరీక్షలు చేశామని,96 మందిని పరీక్షించి వారిలో 20 మందికి తెమడ నమూనాలను సేకరించామని, ఏడుగురిని ఎక్స్రే కొరకు వేములవాడ ఏరియా ఆసుపత్రికి పంపించామన్నారు. అనంతరం మందులు పంపిణీ చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ వినూత్న ఎం.ఎల్.హెచ్.పి, ఉమారాణి ఎం.పి.హెచ్.ఎస్, కళావతి ఎం.పి.హెచ్.ఎస్, లక్ష్మమ్మ ఎం.పి.హెచ్.ఏ, వినోద ఎం.పి.హెచ్.ఎ, రమేష్ ఎం.పి.హెచ్.ఏ ఎం, శారద ఏ.ఎస్ హెచ్.ఏ, మహేంద్ర ఏ.ఎస్.హెచ్.ఏ, మంజుల ఏ.ఎస్.ఎస్.ఏ, రమేష్, గంగాధర్ ఎస్.టి.ఎస్ (టి.బి సూపర్వైజర్), మానువాడ గ్రామ కార్యదర్శి రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here