కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ..

0
151

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల: కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. అసోసియేషన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనాపాల శంకరయ్య కార్యనిర్వహణలో జరిగిన సమావేశంలో ఈ దాడిలో మరణించినవారి కుటుంబాలకు సానుభూతి, సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.

చేపూరి బుచ్చయ్య మాట్లాడుతూ, ఉగ్రవాదులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిమ్మకు నీరెత్తినట్లు ఉండకూడదని డిమాండ్ చేశారు. డాక్టర్ జనాపాల శంకరయ్య సెక్యులరిజం అనే పదానికి అర్థం కోల్పోతున్నదని, ఇలాంటి ఘటనలు శాంతికి విఘాతం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య కాశ్మీర్‌లో శాంతి నెలకొల్పాలని, దొంత దేవదాస్ దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here