- గ్రామ పంచాయతి ఎన్నికుల నిర్వహించాలి…
- సర్పంచ్ లు లేకపోతే అభివృద్ది 10 సంవత్సరలు వెనక్కి పోతుంది..
- నాఫ్స్ కాభ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు
బలగం టివి,సిరిసిల్ల:కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునే ప్రజా పాలన కాగితాలకే పరిమితం అవుతుందని,గ్రామల్లో సర్పంచుల పాలన లేకుంటే,ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ది కుంట పడుతుందని, ప్రభుత్వం పంచాయతి ఎన్నికులు వెంటనే నిర్వహించాలనీ నాప్స్ కాభ్ చైర్మన్ కోండూరి రవీందర్ రావు అన్నారు.శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోనీ బీఅర్ఎస్ పార్టీ అఫీస్ లో ఏర్పాటు చేసిన విలెకర్ల సమావేశంలో కోండూరి రవీందర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కెసిఆర్ నేతృత్వంలో చేపట్టిన హరితహారం,పల్లే ప్రగతి తో పల్లేలు అభివృద్ధి బాటలో నడిచాయని, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి నీ ఇతర రాష్ట్రాల నాయకులు కొనియాడరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రామీణ అవార్డులలో తెలంగాణ గ్రామాలకు ఎక్కువ అవార్డులు వచ్చాయని అన్నారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు ఆగిపోతాయని,ఇతర నిధులు రావుఅనీ, ఇప్పుడు చేసుకున్న అభివృద్ధి 10సంవత్సరాల క్రితం వెనక్కి పోతుందని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సస్యశ్యామలమైందని, మరో కోనసీమగా మారిందని అన్నారు.ఈ పది సంవత్సరల కాలంలో ప్రతి ఎకరాకు సాగునీరు అంది,రైతులు సంతోషంగా ఉన్నారనీ అన్నారు.ఇప్పుడు అపరిస్దితి లేదు అని, ఇప్పటికే కోన్ని ప్రాంతాలలొ సాగునీరు రాక రైతులు రోడ్డు మీదికి వస్తున్నారనీ ,అలాంటి పరిస్ధితి రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనీ డిమాండక్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య,రాష్ట్ర నాయకులు గుడిరి ప్రవీణ్,మున్సిపాల్ చైర్మన్ జిందం కళ,బీఅర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చక్రపాణి,తదితరులు పాల్గొన్నారు