ఫిబ్రవరి 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

0
40
  • ఈ నెల 28న 2026–27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క

బలగం టీవీ, హైదరాబాద్‍:

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

ఈసారి బడ్జెట్‌లో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతులు మరియు సంక్షేమ పథకాలకు గణనీయమైన నిధులు కేటాయించే అవకాశముందని సమాచారం.

దాదాపు 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ, శాఖల వారీగా డిమాండ్లపై చర్చలు, వివిధ బిల్లుల ఆమోదం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా హితానికి అనుగుణంగా పారదర్శక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కట్టుబడి ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఆర్థిక ప్రణాళికలకు దిశానిర్దేశం చేసే ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here