తెలంగాణ రైజింగ్ 2025 చారిత్రక విజయం..

0
54

సీఎం రేవంత్ పాలనపై విశ్వాసం – డా. నోరి దత్తాత్రేయుడు.

బలగం టీవీ, హైదరాబాద్‍:

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అభినందనలు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ చారిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి కి లేఖలో పేర్కొన్నారు.

డీప్‌టెక్, గ్రీన్‌ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం తెలంగాణ రైజింగ్ 2047 ( Telangana Rising 2047) విజన్‌కు అద్దం పడుతుందని, ల‌క్ష‌ల కోట్ల రూపాయల పెట్టుబ‌డులు రావ‌డం ముఖ్య‌మంత్రి పాల‌న‌, స్థిర‌త్వం, భ‌విష్య‌త్తుపైన ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ పోటీ పడటానికి విజన్ 2047 ఉపయోగపడుతుందని, రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు కోసం చేస్తున్న ప్రయత్నాలు హర్షనీయమని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ప్రజారోగ్యంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెట్టుబడులు ఉపయోగపడుతాయని చెప్పారు. క్యాన్స‌ర్ చికిత్స‌లో తెలంగాణ గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా నిల‌బ‌డే అవ‌కాశాలున్నాయని అన్నారు. ప్ర‌పంచ దిగ్గ‌జాల‌ను హైద‌రాబాద్, ఫ్యూచర్ సిటీకి ర‌ప్పించి తెలంగాణ‌ను భార‌త దేశ స్టార్ట‌ప్‌గా, మాన‌వ వనరుల అభివృద్దికి తెలంగాణ ప్ర‌పంచ కేంద్రంగా మారుతుంద‌ని రేవంత్ రెడ్డి రుజువు చేశారని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here