బలగం టీవి,
➡️తెలంగాణ ఏర్పాటైనప్పుడు రాష్ట్రంలో 13.18 శాతం పేదరికం
➡️నీతి ఆయోగ్ సర్వేలో గత పదేళ్ళలో 13.18 శాతం నుంచి 3.76 శాతానికి తగ్గిన పేదరిక నిర్మూలన
➡️కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్
➡️కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం
➡️పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యసాయం పెరిగింది, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది
➡️పట్టణ ప్రాంతాల్లో పేదరికం తగ్గింది
➡️అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన బిడ్డలు అనారోగ్యం నుంచి బయటపడ్డారు
➡️పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇవ్వడంతో మూడు షిప్టుల్లో కార్మికులు పని చేస్తున్నారు
నీతి ఆయోగ్ సంస్థ ప్రతి ఏడాది వివిధ అభివృద్ధి కార్యక్రమాల పని తీరు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పేదరికం ఏ విధంగా నిర్మూలన చేయడం జరిగింది అనే దానిపై ప్రకటన చేయడం జరిగిందని,
తెలంగాణ రాష్ట్రం పేదరిక నిర్మూలన లో ముందు వరుసలో నిలవడం గర్వంగా ఉందని కరీంనగర్ మాజీ పార్లమెంటు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అన్నారు.
కరీంనగర్ లోని క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రాష్ట్రంలో 13.18 శాతం మంది ప్రజలు కటిక దరిద్రంలో ఉండే వారని ఇటీవల నీతి ఆయోగ్ సంస్థ దేశవ్యాప్తంగా 10 అంశాలపై సర్వే నిర్వహించిందని,
తెలంగాణ లో 12 అంశాలపై సర్వే నిర్వహిస్తే 13.18 శాతం నుంచి 3.76శాతానికి పేదరికం నిర్మూలన తగ్గిందని స్వయంగా నీతి ఆయోగ్ సంస్థనే పత్రిక ప్రకటన జారీ చేసిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గిందని, దీనికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ గారు సీఎం అయ్యాక గోదావరి, కృష్ణ నదులపై ప్రాజెక్టుల,తెలంగాణ లో ఉన్నటువంటి 44 వేల చెరువులను పునరుద్ధరించడం ద్వారా రెండు పంటలకు సాగునీళ్లు ఇవ్వడంతో పాటు వ్యవసాయ విస్తీర్ణం పెరగడంతో పాటు ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు…గ్రామాల్లో సర్పంచ్ లు గ్రామాల్లో పరిశుభ్రత వంటి అంశాలపై శ్రద్ధ పెంచడంతో, అనారోగ్య కారణాల నుంచి ప్రజలు బయట పడ్డారు.
అటవీ ప్రాంతాల్లోని గిరిజన బిడ్డలు అనారోగ్యం నుంచి బయట పడ్డారు.పట్టణ ప్రాంతాల్లో పేదరికం పోయిందని పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో కార్మాగారాలు మూడు షిప్టుల్లో పని చేయడం ద్వారా నిరుద్యోగం వంటి సమస్య లేదన్నారు.
పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమ నేత ,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నీ రంగాల్లో అభివృద్ధి చేశారు కాబట్టే తెలంగాణ రాష్ట్రం పేదరిక నిర్మూలన రాష్ట్రంగా దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.