దక్షిణాఫ్రికాలో తెలంగాణ యువకుడి కి*డ్నాప్..

0
49

ఉపాధి కోసం వెళ్లిన యాదాద్రి భువనగిరి యువకుడిని కిడ్నాప్ చేసిన జేఎన్ఐఎం ఉగ్రవాదులు: కేంద్ర ప్రభుత్వానికి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

బ‍లగం టీవీ, హైదరాబాద్‍:

ఉపాధి నిమిత్తం దక్షిణాఫ్రికాకు వెళ్లిన తెలంగాణ యువకుడిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బండసోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్ (23) అనే యువకుడు ఈ కిడ్నాప్‌కు గురయ్యాడు.

హైదరాబాద్‌లోని ఒక బోర్ వెల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్, గత ఏడాది కంపెనీ పని నిమిత్తం దక్షిణాఫ్రికాలోని మాలి దేశానికి వెళ్ళాడు. గత నెల 22వ తేదీ నుండి ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతని తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరుసటి రోజు, అంటే గత నెల 23వ తేదీన, ప్రవీణ్ విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో, అతన్ని జేఎన్ఐఎం (JNIM) ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు ప్రవీణ్ పనిచేస్తున్న బోర్ వెల్ కంపెనీ యాజమాన్యం ధ్రువీకరించింది.

ఈ విషయం తెలియగానే ప్రవీణ్ తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమ కొడుకును ఎలాగైనా సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కన్నీళ్లతో విజ్ఞప్తి చేస్తున్నారు. దక్షిణాఫ్రికా దేశంతో సంప్రదింపులు జరిపి, తమ కొడుకును ఉగ్రవాదుల చెర నుండి విడిపించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here