
సిరిసిల్ల న్యూస్: తంగళ్లపల్లి మండలం:
రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలం అంకిరెడిపల్లిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించి మంత్రి కేటీఆర్ ను మరోసారి అత్యధిక మేజార్టీ తో గెలిపించాలని.. ఈ సారి లక్షా మేజార్టీ ఇవ్వాలని సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. సీఎం కేసీఆర్ అభివృద్ది కార్యక్రమాలను ప్రచారం నిర్వహించారు.
