సిరిసిల్ల న్యూస్:
రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోకజవర్గం తంగళ్లపల్లి మండలం కస్బె కట్కూర్ గ్రామంలో తంగళ్లపల్లి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు వలకొండ వేణు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేటీఆర్ ను గెలిపించుకోవాలని ప్రచారం నిర్వహించారు. కస్బె కట్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు జూపల్లి వెంకట్రావ్, రాజురావులు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిరిసిల్ల అభివృద్ది ప్రధాత కేటీఆర్‌ను అత్యధిక మేజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తంగళ్లపల్లి మండలం కేటీఆర్ తోనే అభివృద్ది అయ్యిందని సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు వేణుగోపాల్ రావు పేర్కొన్నారు.
