సిరిసిల్ల న్యూస్: తంగళ్లపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ కేటీఆర్ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణప శివ జ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గణప మదన్,బిఆర్ఎస్ నాయకులు బుస్సా లింగం, గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి,బిఆర్ఎస్ యూత్ సైనికుడు రాగిపల్లి కృష్ణారెడ్డి,నెబురి నవీన్ రెడ్డి ,పెద్ది, రాము, మంద మహేష్ తదితరులు పాల్గొన్నారు.