బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ఈ రోజు తంగళ్ళపల్లి మండలంలో నీరు అందక ఎండిన వరి పంటలను పరిశీలించిన తంగళ్ళపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు కడారి రామ్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో వరి పంటలు ఎండనటువంటి పరిస్థితులలో ఈ సంవత్సరం వేసిన వరి పంటలు ఎండడం వినడం చాలా బాధాకరం తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వరి పంటలు ఎండకుండా ఉండడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని అలాగే ఎండిన వరి పంట ఎకరానికి 40 వేల రూపాయల నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తంగళ్లపెల్లి మండల శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది.అలాగే రానున్న రోజుల్లో రైతులకు ఇబ్బంది కలిగే వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ పక్షాన సూచించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో పంజా బాలరాజు, పయ్యావుల లక్ష్మణ్,పడిగే సత్తయ్య, దత్తయ్య,అంజయ్య,జక్కని అరవింద్ తదితరులు పాల్గొన్నారు.