రేపు ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల..

0
118

బలగం టీవీ, హైదరాబాద్: 

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. రేపు, ఏప్రిల్ 30, 2025 (బుధవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలు వెల్లడికానున్నాయి.

విద్యాశాఖ మంగళవారం (ఏప్రిల్ 29, 2025) ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఈ సంవత్సరం, గతంలో గ్రేడ్స్ ఇచ్చిన విధానానికి భిన్నంగా, విద్యార్థులకు మార్కులను మంజూరు చేయనున్నారు. అదే సమయంలో, సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్‌ను కూడా ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here