అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించిన సిఐఎస్ఎఫ్ అధికారులు
పార్థివ దేవంపై పడి బోరున విలపించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు
శివకృష్ణారెడ్డి పార్థివ దేహాన్ని మోసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జగ్గారావుపల్లికి గ్రామానికి చెందిన చాడ శివకృష్ణారెడ్డి రాజస్థాన్ లోని డీవోలిలో 6వ బెటాలియన్ లో డాక్యుమెంటరీ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తు డిసెంబర్ 16 తేదీన కిందపడంతో ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 1న మృతి చెందగా అతని మృతదేహాన్ని సీఐఎస్ఎఫ్ అధికారులు స్వగ్రామానికి తీసుకురాగా,యువకులు కొదురుపాక వద్ద జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ, గౌరవ వందనం చేశారు.బైక్ లతో ర్యాలీగా జగ్గారావుపల్లికి తీసుకురాగా, తల్లి తండ్రులు శివకృష్ణారెడ్డి మృతదేహంపై పడి బోరున విలపించారు. పార్థివ దేహాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.దహన సంస్కారాలకు గ్రామం నుండి గ్రామ చివరలోకి తీసుకెళ్లగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాసేపు శివకృష్ణారెడ్డి పార్థివ దేహాన్ని మోశారు. జైపూర్ నుండి పార్థివ దేహం తో వచ్చిన సి.ఐ.ఎస్.ఎఫ్ అధికారులు శివకృష్ణరెడ్డి యూనిఫామ్ ను,జాతీయ జెండాను తల్లిదండ్రులకు అప్పజెప్పి,అధికార లాంచనాలతో అంత్యక్రియలు జరిపారు.కాసేపు గౌరవ వందనం చేశారు.బోయినిపల్లి తహశీల్దార్ పుష్పలత,కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ.సెల్ అధ్యక్షులు కూస రవీందర్ లు పార్థివ దేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు.జైపూర్ నుండి సిఐఎస్ఎఫ్ 6వ రిజర్వడ్ బెటాలియన్ అధికారులు సీనియర్ కమాండెంట్ నితినేష్ కుమార్, కమాండెంట్ ఏకే ఆశిష్ కుమార్ కుందన్,ఇన్స్పెక్టర్ కె. రామచంద్రాలు వచ్చి అధికారుల లాంచనలతో దహన సంస్కరణ చేశారు. డిపార్ట్మెంట్ తరఫున దహన సంస్కారాల కోసం 25 వేల రూపాయలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
