సరిహద్దు రన్ 2025..

0
195
  • జైసల్మేర్-లాంగెవాలా అల్ట్రా మారథాన్‌లో ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ అనిల్ యాదవ్ అద్భుత ప్రదర్శన

బలగం టీవీ, హైదరాబాద్‍:

రాజస్థాన్ – జైసల్మేర్ నుండి లాంగెవాలా వరకు నిర్వహించిన “ది బోర్డర్ రన్ 2025” అంతర్జాతీయ ప్రమాణాల 100 కిలోమీటర్ల అల్ట్రా మారథాన్‌లో జిల్లాకు చెందిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ అనిల్ యాదవ్ పాల్గొని అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎడారి ప్రాంతంలోని తీవ్రమైన వేడి-చలి, అలాగే ఎత్తైన ఇసుక టేకులు వంటి అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, 100 కిలోమీటర్ల ఈ సుదీర్ఘ రన్‌ను కానిస్టేబుల్ అనిల్ యాదవ్ కేవలం 14 గంటలలో పూర్తి చేశారు. ఈ విజయం ఆయన అపారమైన ధైర్యసాహసాలను, అద్భుతమైన శారీరక, మానసిక దృఢతను ప్రదర్శించింది.

ప్రజాసేవలో ఉంటూనే ఇటువంటి కఠినమైన అల్ట్రా మారథాన్ ఈవెంట్లలో పాల్గొనడం ద్వారా ఫోర్స్‌లోని యువ సిబ్బందికి అనిల్ యాదవ్ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు కానిస్టేబుల్ అనిల్ యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి క్రీడా పోటీలలో మరింత ప్రావీణ్యం సంపాదించి, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో అనేక విజయాలు సాధించాలని వారు అనిల్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here