బలగం టివి,ఎల్లారెడ్డిపేట:
రైతులను కేంద్ర ప్రభుత్వం అణిచి వేస్తున్నదని సిరిసిల్ల జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మరి శ్రీనివాస్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తమాని హామి ఇవ్వడంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ రైతులకు స్విట్లు పంపిణి చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ని బిజెపి ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా, పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తున్నదిని అన్నారు.కాంగ్రెస్ పార్టి అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులుతోపాటు పంటలకు మద్దతు ధర కల్పిస్తమాని,ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు గుండాటి రాంరెడ్డి ,జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంగ మల్లారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజేందర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాజు నాయక్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి రఫీక్ , ఎంపీటీసీ కొత్తపల్లి దేవయ్య తదితరులు సాల్గోన్నారు.