బలగం టీవీ, ఎల్లారెడ్డిపేట :
- కొన్ని గంటలనే బిడ్డను హక్కును చేర్చుకున్న తల్లి
బిడ్డ బస్సు దిగుతూ అదృశ్యం కాగా తల్లి ఆగమై వేరే బస్సులో మాచారెడ్డి వరకు వెళ్లి తిరిగి వచ్చి తన బిడ్డను హక్కును చేర్చుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామానికి చెందిన పద్మ అనే మహిళ తన మూడు సంవత్సరాల బిడ్డతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వీక్లీ మార్కెట్ కు వచ్చింది. ఆమె బస్సు దిగుతుండగా తన కూతురు కూడా బస్సు దిగింది అనుకొని చూడగా బస్సు వెళ్ళిపోతున్న క్రమంలో చుట్టుపక్కల ఉన్న మహిళలు తన కూతురు అదే బస్సులో వెళ్ళిపోయిందని చెప్పారు. అయ్యో నా బిడ్డ అదృశ్యం అయింది అనుకొని, తల్లి పద్మ వేరే బస్సులో మాచారెడ్డి వరకు వెళ్ళి వెతుకుతున్నది. ఆ బాలిక ఓ మహిళ వద్ద కు వెళ్లి ఏడుస్తూ ఉండడంతో చుట్టుపక్కల వారు ఈ బాలిక ఎవరు అని ప్రశ్నించగా ఈమె ఎవరో నాకు తెలియదు మార్కెట్లో ఒంటరిగా తిరుగుతూ నా వద్దకు వచ్చిందని సదరు మహిళ మార్కెట్లో ఉన్న వ్యక్తులకు తెలిపింది. ఆ బాలిక ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయగా గుర్తుపట్టిన తల్లి కొద్ది గంటల్లోనే తిరిగి ఎల్లారెడ్డిపేట వీక్లీ మార్కెట్ కు చేరుకొని తన బిడ్డను హక్కును చేర్చుకొని ఆనందం వ్యక్తం చేస్తూ ఆ బాలికను కాపాడిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. దీంతో మార్కెట్లో ఉన్న చిరు వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.