పల్లె దవాఖానలో ఆకస్మిక తనిఖీ చేసిన ఇంచార్జి కలెక్టర్..

0
60

– రోగులతో మాట్లాడి.. వైద్య సేవలపై ఆరా..

  • ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

బలగం టీవీ, ఇల్లంతకుంట:

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పల్లె దవాఖానలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, మందులు ఇచ్చే గది, వ్యాక్సిన్లు, మందుల స్టోర్ రూంలో పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ మొత్తం శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. వైద్యానికి వచ్చిన పలువురు రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. డాక్టర్, సిబ్బంది అందుబాటులో ఉంటూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here