బోయినపల్లి, తంగళ్ళపల్లి మండలాల్లో సందర్శన
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో ఫేజ్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదివారం పరిశీలించారు.
బోయినపల్లి, నీలోజిపల్లి గ్రామాల్లోని పాఠశాలలు ఇంచార్జి కలెక్టర్, తంగళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పోలింగ్ కేంద్రాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ సరళిని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలో ఆవరణలో పరిశీలించారు. ఓటింగ్ పూర్తి అయిన తర్వాత చేపట్టనున్న ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై సూచనలు చేశారు.
ఈ పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, సీపీఓ శ్రీనివాసాచారి, తహసీల్దార్లు నారాయణ రెడ్డి, జయంత్, ఎంపీడీఓలు జయశీల, లక్ష్మీనారాయణ, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.



