మైనారిటీలను పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం..

0
118

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

కేసీఆర్‌ హయాంలో అన్ని మతాల వారు పండుగలు ఘనంగా జరుపుకున్నారు

మాజీ మండల కో-ఆఫ్షన్ సభ్యులు మహ్మద్ ఆజ్జూ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న ఇప్పటివరకు మైనార్టీ శాఖకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాధాకరమని మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ ఆజ్జూ విమర్శించారు.
ఈ సందర్బంగా మహమ్మద్ అజ్జు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు మైనార్టీ డిక్లరేషన్ లో ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి నెలకొందని, షాదీ ముబారక్ చెక్కులు సకాలంలో అందక పేద ముస్లిం కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రంజాన్ మాసం త్వరలో ప్రారంభం కాబోతున్నా ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదని, ఎలాంటి సమీక్ష సమావేశం నిర్వహించలేదని అన్నారు. ఎన్నికల వేళ ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసారు.ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్‌ పండుగను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని, ముస్లిం సోదరుల కుటుంబాలకు ఎలాంటి బహుమతులు ఇవ్వలేదని మండిపడ్డారు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని, అన్ని మతాల పండుగలు ఘనంగా జరుపుకునేలా నిధులు కేటాయించారని గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here