బలగం టీవీ, హైదరాబాద్:
నోటిఫికేషన్ కేసిఆర్ వి …గొప్పలు కాంగ్రెస్ వి
- డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి సభలో, మరోపక్క పీసీసీ అధ్యక్షుడు 55 వేయిల ఉద్యోగాలు ఇచ్చామని గప్పాలు కొడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలలో 1 ఉద్యోగం ఇవ్వలేదని వనపర్తి సభలో చెప్పిన మాటలు అబద్ధాలు,అసత్యాలు అని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చమో, ఎవరు ఇచ్చారో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారిని అడిగి తెలుసుకో అని, ఏ వేదికలోనైన 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్తు నిరుద్యోగ యువతను మోసం,దగా చేస్తున్నారని నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టి ఎన్నికల్లో వాడుకొని గద్దెనెక్కినంక మొండిచేయి చూపించిందని, ఉద్యోగాల విషయం లో నిరుద్యోగులకు అడ్డాగా ఉన్న అశోక్ నగర్ లో చర్చకు సిద్ధమా అని, బిఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది 2,32,308 ఉద్యోగాలు,నోటిఫికేషన్ ఇచ్చింది 2,02,735 ఉద్యోగాలు, పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టింది 1,60,083 ఉద్యోగాలు అని దీంట్లో కోర్ట్ కేసుల వల్ల, ఎన్నికల కోడ్ వల్ల ప్రక్రియల్లో ఉన్నవి 42,652 ఉద్యోగాలు అనిదీంట్లో ఏది తప్పు అయినా, ఏ శిక్షకైనా మేము సిద్ధం,మీరు సిద్ధమా అని అన్నారు.
అభయ హస్తంలో మేనిఫెస్టోలో మొదటి ఏడాది లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసాగించారని నిరుద్యోగ యువతకు భృతి 4వేలు చొప్పున ఇస్తానని చెప్పి మోసగించారని, రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగులకు 15 నెలల బకాయి దాదాపు 18 వేల కోట్ల రూపాయలు భాకి పడ్డారని చిత్త శుద్ధి ఉంటే ఆ పని చెయ్యండి. బిఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలు ఇవ్వడం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ, మందికి పుట్టిన బిడ్డలని,మా బిడ్డలని ముద్ధాడుతున్నారని అన్నారు.
ఉదాహరణకు గత ప్రభుత్వం ఇచ్చిన పోలీసు కానిస్టేబుల్ కు నోటిఫికేషన్ తేదీ ఏప్రిల్ 25, 2022,పరీక్షా తేదీ 28.ఆగస్టు 2022. మొత్తం ఉద్యోగాలు 17,805 ఉద్యోగాలు ఇచ్చిందని నియామక పత్రం ఇచ్చింది ఫిబ్రవరి 14,2024. డీఎస్సీ ఉద్యోగాలు బి ఆర్ ఎస్ సర్కార్ హయాంలో 5086 ఇస్తే దాన్ని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 5973 కలిపి 11,059 ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు.
ముఖ్యమంత్రి పదే పదే కేసిఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయని అంటున్నారని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలు లేవు గాని కాంగ్రెస్ పార్టీ కుటుంబం లో అందరికి ఉద్యోగాలే అని రాహుల్ గాంధీకి పార్లమెంట్లో లో LOP ఉద్యోగం అని, ప్రియాంక గాంధీకి వైనాడ్ లో ఎంపీ ఉద్యోగం అని, రాష్ట్రములో మీ పార్టీ కుటుంబం లో మీ సోదరునికి పదవి లేని కాబినెట్ రాంక్ , కలెక్టర్ తో సెల్యూట్ , పోలీస్ అధికారులతో సెల్యూట్లు కొట్టించుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ లో డజన్ కు పైగా కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వచ్చాయి కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేవని అన్నారు.
ఉమ్మడి ఏపీలో నాడు కాంగ్రెస్ పాలించిన సమయంలో 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో APPSC ద్వారా కేవలం 24 వేల ఉద్యోగాలు మాత్రమే నింపింది,అది 23 జిల్లాలు ఉన్న ఏపీలో అందులో 42% వాటా అనుకుంటే మనకు దక్కినవి తెలంగాణకు కేవలం 10వేల ఉద్యోగాలు మాత్రమే అని, సంవత్సరానికి కేవలం 1000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, బిఆర్ ఎస్ సర్కార్ హయాంలో సంవత్సరానికి సుమారు 20 వేల ఉద్యోగాలు ఇచ్చిందని అసెంబ్లీ లో ఇచ్చిన JOB క్యాలెండర్ ఎటు పోయిందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఎక్కడ ఉద్యోగాలు అని అన్నారు.
రాష్టంలో 15 నేలలు గడుస్తుంది ఇప్పడికి విద్య శాఖ మంత్రి లేరని, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒక స్వేత పత్రం విడుదల చేయండి అని, బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తెల్సుకొని మాట్లాడండి అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సీఎం లా కాకుండా ఇంకా పీసీసీ అధ్యక్షుడిగానే మాట్లాడుతున్నారని రాష్ట్రంలో ఒక పక్క రైతులను, మహిళలను,చేనేతలను,మోసగించినట్లే నిరుద్యోగులను కూడా మోసం చేస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎగబెట్టిన హామీలు ఒక్కమాటలో చెప్పాలంటే ADK అని అన్నారు. A ఆంటే ఎగవేతలు, D అంటే దాటవేతలు
K అంటే కాలయాపన చేయడం తప్ప కాంగ్రెస్ ఇంతకు మించి ఎం చేస్తలేరని అన్నారు. కాంగ్రెస్ చెప్పుకుంటున్న ప్రజా పాలన కాదు ఇది ప్రజా కంటక పాలన అని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఎగ్గొట్టిన ఎగవేతల ప్రభుత్వం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొమ్ముల నరేందర్, అల్లేని నిఖిల్,దామోదర్ రెడ్డి,మనోజ్ లు పాల్గొన్నారు.