బలగం టివి, సిరిసిల్ల :
కులగణన తో బీసీలకు రాజ్యాధికారం…
–బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు..
బీసీ కులగణన తో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం సాకారం అవుతున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు అన్నారు.తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్లో బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ బీసీ నేత బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీల దశాబ్దాల కళ అయిన బీసీ కులగలనా చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం గొప్ప విషయం అన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులగన చేపడతామని హామీ ఇచ్చి అందుకు తగ్గట్టు ఏర్పాటు చేయడం పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేశారు. గతంలో బీసీ కులగణన చేపట్టకపోవడం పట్ల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందనీ,భవిష్యత్తులో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే బీసీ కులగణన జరిగి తీరాల్సిందేనని అన్నారు.కులగణన అనంతరమే స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహించాలని,స్థానిక సంస్థలలో42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణమైన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీసీ కులగణన జపం చేస్తా, బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ కులాలను పట్టించుకోలేదని అన్నారు. బీసీ ప్రధాన మంత్రి గా ఉన్న మోడీ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇంతవరకు ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదని, చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని ఆరోపించారు, ఇప్పటికైనా బీసీలకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో జనాభా ప్రతిపాదికన వాటా కల్పించి బీసీలకు న్యాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, బిజెపి పార్టీకి పర్శ హన్మాండ్లు విజ్ఞప్తి చేశార. బీసీ కులగణన చేపట్టాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకి ధన్యవాదాలు తెలిపారు , ఏ పార్టీ అయినా రాజకీయాలకు అతీతంగా బీసీలకు మంచి చేస్తే స్వాగతిస్తామని, కీడు చేస్తే అన్యాయం చేస్తే ఆ పార్టీలను ఎండగడతామని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు గోనె ఎల్లప్ప, తడుక కమలాకర్, సామల తిరుపతి, నల్ల శ్రీకాంత్, గాజుల సాగర్, అన్నదాసు భాను, అల్లే బాలరాజు, మార్గం లక్ష్మణ్ ,దొంత రవి, బచ్చు ప్రసాద్ ,దువ్వాళా కొండయ్య, చిందం శ్రీధర్ బిట్ల రాఘవులు ,వెంగళ ప్రమోద్, ఇల్లంతకుంట తిరుపతి తదితరులు పాల్గొన్నారు,