–మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీని అమలు చేస్తాం
–అభివృద్ధి ఒక కన్ను, సంక్షేమం మరొకన్నుగా భావిస్తూ ముందుకు వెళ్తాము
–పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తా
–ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
బలగం టివి,వేములవాడ:
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఆలయ అభివృద్ధి కొరకు ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిగా ఇప్పటికే సీఎం రేవంత్ అధ్యక్షతన విటిఏడిఏ సమావేశం నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ పట్టణంలోని మహా లింగేశ్వర గార్డెన్ లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిధిగా హజరై , 77మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చేశారు. చెక్కులు పంపిణి చేశారు.ఈ సందర్బంగా అది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ అలయ అభివృద్ది పై అథారిటీ వైస్ చైర్మన్ ,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్నారు.గత ప్రభుత్వ హయాంలో సీఎం కేసిఅర్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికి ఒక్క సమావేశం ఏర్పాటు చేయలేదని, ఆలయ అభివృద్ధిని పట్టించుకోలేదని, దీంతో హెచ్ఎండిఏ ద్వారా గతంలో మంజూరైన రూ.30కోట్ల నిధులలో నుండి రూ.20కోట్లు తిరిగి వెళ్లిపోతే, సీఎంతో మాట్లాడి మళ్ళీ రూ.20కోట్లను తిరిగి తెప్పించడం జరిగిందని అన్నారు. మరికొద్ది రోజుల్లోనే పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్తరణ, మూలవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి, శివార్చన వేదిక,గుడి చెరువు బండ్ నిర్మాణం వంటి పనులు పూర్తవుతాయని, మురికి కూపంగా మారిన రాజన్న గుడి చెరువు, మూలవాగును ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎస్టీఎఫ్ నిదులు మంజూరు కొరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయని, నిధులు విడుదలైన వెంటనే డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామని అన్నారు. రాజన్న ఆలయాన్ని, పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు. సాగునీటి రంగం అభివృద్ధిలో భాగంగా మరిపల్లి రిజర్వాయర్ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా తమ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల అభ్యున్నతికై తోడ్పాటును అందిస్తూ, అభివృద్ధి ఓ కన్నులాగా, సంక్షేమం మారో కన్ను లాగా భావిస్తూ ముందుకు వెళ్తామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే పార్టీ అని ,పేద ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామని, 6 గ్యారెంటీలలో భాగంగా ఇప్పటికే మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ పథకం పరిమితి రూ.10లక్షలు పెంపు అమలు జరుగుతుందని, ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చే మరో రెండు పథకాలైన రూ. 500లకే సిలిండర్, 200యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం మరో వారం రోజుల్లోగా అమలవుతుందని, దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చినరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎమ్మార్వో మహేష్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు సంఘ స్వామి యాదవ్, చిలుక రమేష్, పుల్కం రాజు, పీర్ మహమ్మద్, వంగల శ్రీనివాస్, పులి రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.