- ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి డిమాండ్
బలగం టీవి ,తంగళ్లపల్లి
తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో లో చెప్పిన విధంగా ఇంటి నిర్మాణం తో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడుతాయని అనేక మంది విద్యార్థులు తమ చదువులు,ఆరోగ్యాలను పక్కనపెట్టి ఉద్యమలు చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి తెలంగాణ సాధనలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి తెలంగాణలో సాధించుకోవడం జరిగింది.కానీ గత బి ఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను విస్మరించింది.అందువలన గత ప్రభుత్వం విద్యార్థి ఉద్యమకారులకు చేసిన మోసం వలన ఉద్యమకారులు అటు చదువలేక ఇటు జాబ్ రాక,రాజకీయంగా ఎదగలేక ఎటు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.నేడు కాగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా విద్యార్థులు ఉద్యమకారులు తమ వంతు పాత్ర నిర్వహించారు.కాబట్టి కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సహాయపడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంతే కాకుండా గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోకుండా చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేయకుండా ప్రజా తెలంగాణ లో ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలని అన్నారు.