బలగంటివి, గంభీరావుపేట.
- మిడ్ మానేరు లో నీళ్లు లేవు.. కేసీఆర్ ఉంటే ఎప్పటికప్పుడు నింపుతుండే.
- రాజకీయ నాయకులకు పదవి విరమణ అనేది ఉండదు
- కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయిన పల్లి వినోద్ కుమార్..
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ఇచ్చి బి ఆర్ఎస్ ను ఓడ గొట్టింది. అబద్దాలను చెబుతూ నిజాలను నమ్మకుండా చేసింది. పచ్చి అబద్దాలు, ఊహకందని హామీలను ఇచ్చి గెలిచిందని, గట్టి పునాది లేకుండానే, అబద్దాల పునాదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయిన పల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం గంభీరావు పేట మండలంలోని గజసింగారం గ్రామంలో టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవిందర్ రావు ఆధ్వర్యంలో ఇటీవల పదవీకాలం పూర్తయిన వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్ ల కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ మిడ్ మానేరు లో నీళ్లు తగ్గినాయని, దానిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అదే కేసీఆర్ ఉంటే ఎప్పటికప్పుడు మిడ్ మానేరు నింపుతుండెనని అన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత అధికారం ఉంటుందో, ప్రతిపక్షానికి అంతే బలం ఉంటుందని, బలమైన ప్రతిపక్షం మనది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు అమలు చేసేందుకు పోరాటాలు చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు.తెలంగాణ వచ్చిన తర్వాత 7000 మెగావాట్ల నుండి 26 వేల మెగావట్ల కు కెసిఆర్ కరెంటు ఉత్పత్తి చేశారని, తెలంగాణలో పుష్కలంగా కరెంటు ఉంది అని, 24 గంటల కరెంటు ఇవ్వవచ్చు అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు అని అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రవేశపెట్టిన ప్రొవైడింగ్ అర్బన్ అమెనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ పథకాన్ని దేశంలోనే మొట్టమొదటి సారిగా పదేళ్ల పాలన కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో అమలు చేశారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు గ్రామాలు అభివృద్ధి జరగలేదని,2014లో కేసీఆర్ సీఎం అయ్యాక పదేళ్ల కాలంలో గ్రామాలను అభివృద్ధి లో అగ్రగామిగా తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు.
పదేళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు 1.61లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగులకు జనవరి,ఫిబ్రవరి నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి జీతాలు వేశారో లేదో నిజం చెప్పాలని అన్నారు.డిసెంబర్ 24 వరకు 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడని, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.ఫిబ్రవరి చివరి వరకు ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.గత ప్రభుత్వ హయాంలో 7వేల మంది స్టాప్ నర్సుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష నిర్వహిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.
ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కోట్లాది మొక్కలు నాటడం జరిగిందని, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, స్మశానవాటికలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో పదవులు వస్తుంటాయి పోతుంటాయి, అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి శాశ్వతంగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పిటిసి విజయ లక్ష్మణ్,సెస్ డైరెక్టర్ నారాయణరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట స్వామి గౌడ్, పలు గ్రామాల మాజీ సర్పంచులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
