బలగం టీవీ,తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సందర్శించారు.పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి ఎఫ్ఎల్ఎన్ అంశాలను పాఠశాల రిజిస్టర్లను పరిశీలించారు.అనంతరం విద్యార్థుల నైపుణ్య జ్ఞానం తెలుసుకోవడంలో విద్యార్థులచే పాఠ్యాంశాలను చదివించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు యస్ ఎల్లయ్య మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.