శాంతియుత ఎన్నికల కోసం జిల్లా పోలీస్ యంత్రంగం సంసిద్ధం..

0
95
  • పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి..
  • ఎన్నికల నియమవళిపై పోలీస్ అధికారులు గ్రామాలు పర్యటిస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు..
  • అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు..
  • ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే మాటాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు..

– జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.ఐపీఎస్.

స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా పంచాయతీ ఎన్నికలు జరిగేందుకు,ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేల,ఎన్నికల నియమవళిపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పోలీసు యంత్రాంగం గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకం అవుతూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు,మద్యం,ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలను ప్రశాంత, శాంతియుత వాతావరణంలో, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా,ప్రజలు భయాందోళనకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛయూత వాతావరణంలో వినియోగించుకునేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని,ఎన్నికలను శాంతియుత వాతావరణం నిర్వహించేందుకు 800 మంది పోలీస్ సిబ్బంది సంసిద్దంగా ఉన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన, రెచ్చగొట్టే మాటాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here