బలగం టీవి ,,
గడిచిన సంవత్సర కాలంలో 60 కి పైగా కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి జైలు శిక్షలు
కోర్టు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడం, శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు సూచించారు. ఈరోజు ఎస్పీ కార్యాలయంలో పీపీలకు వివిధ కేసుల్లో నిధుతులకు శిక్షలు పడే విధంగా కృషి చేసినందుకు అభినందించి ప్రసంశ పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. న్యాయాధికారులు ,పోలీస్ అధికారులు సమన్వయం పాటిస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.పోలీస్ అధికారులు నిరంతరం పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలిస్తూ,ఉన్నతాధికారుల సలహాలు,సూచనలు పాటిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పోక్సో, హత్య కేసులను ప్రధానమైనవిగా భావించి ముందుకు సాగాలని ప్రతి కేసుల్లో పంచనమ చేసే సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఫోటోలు వివరాలు సమగ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సాంకేతికత ప్రస్తుత రోజుల్లో కీలకంగా మారిందని అన్ని కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలు కచ్చితంగా జమ చేయాలన్నారు.కోర్టు కేసులకు సంబంధించిన ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదుపడేలా కృషి చేయాలని శిక్షల శాతం పెరిగేలా పనిచేసే అధికారులను సిబ్బందికి రివార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు