రోడ్డు ఎక్కిన రైతన్న..

0
41

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఏదో ఓ రకంగా రైతులు నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై వరి ధాన్యం తూకం వేసిన, వరి ధాన్యం బస్తాలు కల్లాల్లోనే మూలుగుతున్నాయి.వడ్డ కుప్పల వద్దనే రైతులు రాత్రిబవళ్లు కాపలా కాస్తున్నారు. అకాల వర్షాలు పడడంతో చేతికి వచ్చిన పంట నీటి పాలు అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంభీరావుపేట మండలం కేంద్రంలోని ఐకెపి సెంటర్లు వరి ధాన్యం తూకం వేసిన లారీలు రాకపోవడంతో మంగళవారం సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్, తాసిల్దార్, ఏఎంసీ చైర్మన్ రావాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిందని సంబరపడ్డ సమయంలో అకాల వర్షాలతో ఆగమాగం అవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజుల నుంచి ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం పోసి అరగోస పడుతున్నామని అన్నారు. వరి ధాన్యం కాంటాలై లారీలు రాక పోవడంతో రైతులు తమ ధాన్యం లారీలలో ఎక్కే అంతవరకు మీరే బాధ్యులని ఐకేపీ నిర్వాహకులు తేల్చి చెప్పడంతో లారీల కోసం నిరీక్షించిన రైతులు దిక్కుతోచక రోడ్డు ఎక్కామన్నారు.

సంఘటన స్థలానికి ఎస్సై ప్రేమ్ నందం, ఏ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి చేరుకొని రైతులను సముదాయించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో ఎస్సై ప్రేమ్ నందం మాట్లాడడంతో రైతులు ధర్నా విరమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here