- మండల వ్యవసాయ అధికారిని ప్రణీత
బలగం టీవీ, బోయినిపల్లి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భీమా పథకం 2025 పాలసీ సంవత్సరం ఈ 14 ఆగస్టు 2025 న రెన్యువల్ చేయబడుతుంది. జూన్ 5, 2025 వరకు భూభారతి పోర్టల్ లో అందుబాటులో ఉన్న, 18 నుండి 59 సంవత్సరాల వయస్సు ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.
బోయినిపల్లి మండలంలో గత సంవత్సర కాలంలో అనగా జూన్ 5, 2025 వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు 366 మంది రైతులు ఉన్నారు. వీరు తమ పట్టదార్ పాసబుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ లను రైతు భీమా ఫారంతో పాటు మీ యొక్క వ్యవసాయ విస్తీర్ణ అధికారికి ఆగస్టు 13వ తారీఖు లోగా ఇవ్వాలి. గత సంవత్సరం రైతు భీమా పధకంలో రిజిస్టర్ అయి ఉన్న రైతులు ఎవరైనా ఏదేని చేర్పులు ఉంటే ఆగస్టు 12, 2025 లోగా మీ వ్యవసాయ విస్తీర్ణ అధికారికి అప్పగించవలేనని మండల వ్యవసాయ అధికారిని కె. ప్రణీత పత్రిక ముఖంగా రైతులను కోరారు.
