బలగం టీవి ….
సిరిసిల్ల 02, జనవరి 2024:
‘జలశక్తి అభియాన్’ కింద చేపట్టిన జిల్లాలో చేపట్టిన పనులను కేంద్ర బృంద సభ్యులకు చూపించాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
‘జలశక్తి అభియాన్’ కింద జిల్లాలో నీటి సంరక్షణ కార్యక్రమాలలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలనకు
కేంద్ర బృందం ఈ నెల 4, 5 తేదీలలో రానున్న దృష్ట్యా
మంగళవారం కలెక్టరేట్‌లో జలశక్తి అభియాన్ పనులు, కేంద్ర బృంద సభ్యుల టూర్ పై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కేంద్ర అధికారుల బృంద క్షేత్ర పర్యటనను పకడ్బందీగా ప్లాన్ చేయాలన్నారు. బెస్ట్ వర్క్ లను సందర్శన చేసేలా చూస్తూ.. ఆ పనుల వల్ల కలిగిన ప్రయోజనాలను సభ్యులకు తెలియజేయాలన్నారు.
సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కేంద్ర అధికారుల బృంద పర్యటనను సక్సెస్ చేయాలన్నారు.
సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లు పూజారి గౌతమి, ఎన్ ఖీమ్యా నాయక్, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి,drdo నక్క శ్రీనివాస్, ఫారెస్ట్, మిషన్ భగీరథ, మున్సిపల్, భూగర్భజల, మేజర్, మైనర్ నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల చే జారీ చేయనైనది.