బలగం టివి, ఇల్లంతకుంట
తెలంగాణ ఉద్యమనేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినం సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి దేశంలోని 32 రాజకీయ పార్టీల దగ్గరకు తిరిగి 28 రాజకీయ పార్టీలను ఒప్పించి రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని….పదేళ్ల పాలన కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు తో లక్షల ఎకరాల భీడుభూములకు సాగునీళ్లు అందించిన ఆపరభగీరతుడన్నారు.
రైతుబంధు, రైతుభీమా పథకాలతో రైతన్నల కళ్ళలో చిరునవ్వులు చూసిన మహానీయుడని, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డల పెళ్లి ₹లక్ష116 సాయం అందించి పెద్ద దిక్కుగా మారినారన్నారు.
దళితుల బతుకులు మారాలి…దళితులు కూలీలుగా కాదు తలకెత్తుకుని బ్రతికేలా ఉండాలనే లక్ష్యంతో దళితబంధు తెచ్చి దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడన్నారు, వ్యవసాయం దండగ కాదు పండుగ అనే విధంగా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చి రైతులకు పెద్దన్నగా మారినారని పేర్కొన్నారు , ఏ దిక్కులేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు ఇచ్చి అండగా నిలబడినారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఒగ్గు నర్సయ్య, పర్శరాం,ముత్యం రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, కేవీఎన్ రెడ్డి, పర్శరాం, సాదుల్, భూమయ్య,చందన్, బాలకిషన్, పట్నం శ్రీనివాస్, ఆరే కొమురయ్య, ఎల్లవ్వ, రాజారాం, శ్రీనివాస్, రఘు, మధు, రమేష్, పర్శరాం, సూర్య, ప్రశాంత్ రెడ్డి, ఉస్మాన్, మహేష్, రాజేశం, మోహన్, బాలాగౌడ్, మల్లవ్వ, రాములు తదితరులు పాల్గొన్నారు.