మొదటి ఫేజ్ పోలింగ్ శాతం 79.57

0
78

ఎంసీసీ పాటిస్తూ ఓట్ల లెక్కింపు

రుద్రంగి, ఆర్ అండ్ ఆర్ కాలనీ శాబాష్ పల్లిలో ఓట్ల లెక్కింపు పరిశీలన

ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

బలగం టీవీ, రుద్రంగి/వేములవాడ అర్బన్:

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మొదటి ఫేజ్ ఎన్నికల పోలింగ్ శాతం 79.57 గా నమోదు అయిందని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. రుద్రంగి, వేములవాడ అర్బన్ మండలాల్లో గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టగా, ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మొదటి ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో స్టేజ్ -2 ఆర్ఓలు, పోలింగ్ ఏజెంట్ సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) పాటిస్తూ వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితాలు ప్రకటించి పరోక్ష పద్ధతిలో ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, సీపీఓ శ్రీనివాసాచారి, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here