సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పూర్వ వైభవం కాంగ్రెస్ తోనే సాధ్యం

0
140

టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పూర్వవైభవం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మృత్యుంజయ మాట్లాడుతూ బిఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్లలో అరాచకాలు, మాఫియాలు, దోపిడీలు జరిగిగాయని మండిపడ్డారు. బిఆర్ఎస్ నేతల అవినీతి అక్రమాల చిట్టాలు గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. కేటీఆర్ అండతో ఇసుక మాఫియాకు తెరలేపి సిరిసిల్ల సహజ వనరులను దోచుకున్నారన్నారని, ఒక్క నెలకు 140 కోట్ల ఇసుక రవాణా జరిగిందని అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను అన్ని రకాల ఆదుకున్నామని గొప్పలు చెప్పిన కేటీఆర్, టెక్స్టైల్ పార్క్ ఎందుకు మూతపడిందో చెప్పాలని సవాలు విసిరారు. కెసిఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా పనిచేస్తుందని, కాలేశ్వరం అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరపడానికి సిద్ధమయ్యారన్నారు. జిల్లాలో 150 స్టోన్ క్రషర్లు సరియైన అనుమతులు లేకుండా నడుస్తుంటే, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు కూడా ఇంకా బిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతుందనే మత్తులో పనిచేస్తున్నారని, ఇకనైనా అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరాజు, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన, నాయకులు వైద్య శివప్రసాద్, కమలాకర్, వనిత గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here