- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బలగం టీవీ, బోయినిపల్లి:
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా అధ్యక్షలు పట్నం ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు గంగాధరలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గురువారం రోజున మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి సన్మానించారు.అనంతరం ఎమ్మెల్యే నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సన్మానించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జర్నలిస్టుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ: అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయించడంతో పాటు, మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించే విధంగా త్వరలోనే చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నల్లగొండ వేణుగోపాల్, ఉపాధ్యక్షులు గడ్డం తిరుపతి, గజ్జెల శ్రీనివాస్, కార్యదర్శి అతికం రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి కూస రవి, శ్రావణపల్లి గణేష్ లు ఉన్నారు.

