బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేయాలి..

0
295

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

శివనగర్‌లోని శివాలయంలో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పట్టణ కమిటీకి, అలాగే పూర్వ పట్టణ కమిటీకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పార్లమెంట్ కో-కన్వీనర్ ఆడెపు రవీందర్, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, సీనియర్ నాయకులు గరిపెల్లి ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను, పూర్వ కమిటీ సభ్యులను సన్మానించారు.

ఈ సందర్భంగా నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ పాత, కొత్త కమిటీలు కలిసికట్టుగా పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో అడపు రవీందర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగిరిందని గుర్తు చేశారు. ఆ ఐదేళ్ల కాలంలో సిరిసిల్లలో అభివృద్ధి ఎలా ఉండాలో అప్పటి మున్సిపల్ చైర్మన్ అడపు రవీందర్ చేసి చూపించారని కొనియాడారు. సిరిసిల్లలో ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కరికీ గుర్తుకొస్తాయని అన్నారు.

అడపు రవీందర్ హయాంలో పాత బస్టాండ్‌లో బస్టాండ్ నిర్మాణం, బస్టాండ్‌లో షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్‌లో షాపింగ్ కాంప్లెక్స్, కార్గిల్ లేక్ సెంట్రల్ లైటింగ్, బీవై నగర్‌లో రోడ్లు, మురికి కాలువలు వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు. రవీందర్ ని ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి ఒక్కరూ తమ వార్డులలో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకొని విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తనతోపాటు పనిచేసిన కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు కొండ నరేష్, మేర్గు శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు అంకారపు రాజు, కంభోజ శ్రీధర్, నరసయ్య, కార్యదర్శులు కోడం రవి, సూరం వినయ్, ఎనగంటి నరేష్, గాజుల సదానందం, ఊరగొండ రాజు, గుడ్ల విష్ణు, సుంకోజు రమేష్ చారి, సుంకరి బాలకిషన్, మొగిలి రాజు, పండగ మాధవి, వేముల వైశాలి తదితర భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here