బలగం టీవీ, ఎల్లారెడ్డిపేట:
బిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో 9వ ప్యాకేజీ కెనాల్ కు నీటిని అందించే బాధ్యత ప్రభుత్వానిదే నని ఎల్లారెడ్డిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య గురువారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మల్కపేట రిజర్వాయర్ 9వ ప్యాకేజీ కెనాల్ లో నీటిని పరిశీలించి రైతులతో మాట్లాడారు. గత 15 రోజుల నుండి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, అధికారులతో మాట్లాడి కెనాల్ కు నీటిని విడుదల చేయగా ప్రస్తుతం రైతులు కరెంటు మోటార్లు అమర్చి నీటిని తీసుకోవడం జరుగుతుందన్నారు.మద్య మానేరు నుండి 0.5 టిఎంసిల నీటిని మల్కపేట రిజర్వాయర్ కు పంపింగ్ ద్వారా వస్తుందని అదే నీటిని 9వ ప్యాకేజీ కెనాల్ ద్వారా వరి పొలాలకు నీరు వస్తుందన్నారు.నెల రోజులపాటు నీరు అందించి పొలాలను కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ అబద్దాల వీడియోలు సృష్టిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. అక్కపల్లి, బుగ్గ రాజేశ్వర తండా, అల్మాస్పూర్, కిస్టు నాయక్ తండా ,రాజన్నపేట,దేవుని గుట్ట తండా,బాపురుపల్లి తండా, తిమ్మాపూర్, గొల్లపల్లి, గ్రామాలకు సంబంధించిన రైతులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని నీళ్లు వస్తలేవని షట్టర్లను దించారని మధ్య మానేరు నుండి పంపింగ్ జరుగుతలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దన్నారు.స్వయంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రైతులతో కలిసి అక్క పల్లి బుగ్గ రాజేశ్వర స్వామి నుండి మలకపేట రిజర్వాయర్ షట్టర్ల వరకు పరిశీలించడం జరిగిందన్నారు. రైతులెవరు అధైర్యపడవద్దని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు మలకపేట రిజర్వాయర్కు వెళ్లి నీటి పంపింగ్ ను పరిశీలిస్తూ తొమ్మిదవ ప్యాకేజీ కెనాల్కు నీటి విడుదలను కూడా చూస్తున్నారని అన్నారు. వారికి రైతుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి, డైరెక్టర్లు చెట్పల్లి బాలయ్య, గణపతి, మిండేటి శ్రీనివాస్ యాదవ్,శ్రీకాంత్ రెడ్డి,తిరుపతి రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్,నాయకులు చెన్నిబాబు, వంగ మల్లారెడ్డి, కొత్తపల్లి నరసింహులు,పందిర్ల శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వెంకటేష్ మూర్తి, అంజిరెడ్డి, బాలు యాదవ్, గంగయ్య, పరశురాములు, లక్ష్మణ్, కల్లూరి బాపురెడ్డి, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, బిపేటరాజు,భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.