వడగండ్ల వానకు నష్టపోయిన పంటకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలి..

0
174

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

బిఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు

కోనరావుపేట మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో ఇటీవల వడగండ్ల వానకు తీవ్రంగా పంట నష్టపోయిన రైతన్నలకు వెంటనే పరిహారం అందించాలని బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా గురువారం పంట నష్టపోయిన వేములవాడ రాములు, పసుల జాను, మంగళి కొండయ్య రైతన్నల పొలాలను ఆయన పరిశీలించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సింగిల్ విండో ఛైర్మెన్లు బండ నర్సయ్య, రామ్మోహన్ రావు, నాయకులు కేందే గంగాధర్, వంశీ కృష్ణ, గోపు పరశురాములు, మల్లేశం, నరసయ్య, దేవయ్య, రవి, శివతేజ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here