బలగం టివి ,
➡️నిజాన్ని నమ్మకుండా చేసి..కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేసి ఓట్లు దండుకుంది
➡️ఏ ప్రభుత్వ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం లు జీవో విడుదల చేయించాలి
➡️కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్
➡️పదేళ్ళలో బీఆర్ఎస్ సర్కారు 1లక్ష60083 ఉద్యోగాలు భర్తీ చేసింది, మరో 42,652 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించింది.

➡️మరో 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది
➡️డిసెంబర్ 24 వరకు రెండు లక్షల ఖాళీలు భర్తీ చేయాలి
➡️బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7వేల స్టాప్ నర్సు పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటుంది
➡️కాంగ్రెస్ సర్కారు తీరు చూస్తుంటే సొమ్మకరిది…సోకోకరిది అన్నట్టు ఉంది
➡️కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం
➡️నేను పుట్టింది కరీంనగర్ గడ్డపైనే
➡️ఓటమి భయంతోనే బండి సంజయ్ ఆరోపణలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం ఎన్నికల సమయంలో చెప్పినారని, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి చివరికళ్ళ ప్రభుత్వం జీవో విడుదల చేయాలని, డిసెంబర్ 31 వరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ రావు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిందని, నిజాన్ని నమ్మకుండా చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు.
పదేళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు 2,32,308 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను గుర్తించి 1.61లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని, మరో 42,652 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిందని, 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా విడుదల చేసిందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి జీతాలు వేశారో లేదో నిజం చెప్పాలని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో 7వేల మంది స్టాప్ నర్సుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష నిర్వహిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న పని చూస్తుంటే సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు ఉందని దుయ్యబట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి గాలిమాటలు కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకంటెంనిరుద్యోగులు ప్రభుత్వం పై తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని అన్నారు.
నేను కరీంనగర్ గడ్డపైనే పుట్టి పెరగడం జరిగిందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇన్నేళ్ళుగా మాట్లాడని మాటలు బండి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతన్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ కార్మిక విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రూప్ సింగ్, జమ్మికుంట మున్సిఫ కౌన్సిలర్ దిలీప్ , బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్,దూలం సంపత్ గౌడ్, ద్యావ మధుసూదన్ రెడ్డి, సత్యం యాదవ్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.