బలగం టివి: రాజన్న సిరిసిల్ల:
మూసి వేయబడ్డ టెక్స్టైల్ పార్కును తెరిపించాలి
నేతన్నలకు ప్రభుత్వ ఆర్డర్లు ఇప్పించాలి.
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ .
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాంగ్రెస్ సర్కార్ ఆదుకొని నేతన్నలకు న్యాయం చేయాలని బిజెపి పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
గత సర్కార్ నిర్వాకం వల్ల పీకల్లోతు కష్టాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నెట్టి వేయబడింది . గత పది రోజుల కిందట గిట్టుబాటు ధర లేక టెక్స్టైల్ పార్కు వస్త్ర వ్యాపారులు పరిశ్రమను బందు పెట్టుకున్నారు. తాజాగా సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు కూడా బట్ట ఉత్పత్తిని ఆపేశారు.
సిరిసిల్ల నేతన్నల కోసమే బతుకమ్మ చీరల ఆర్డర్లు తీసుకొచ్చాను అని పదే పదే చెప్పుకున్న మాజీ మంత్రి కేటీఆర్ నేతన్నలకు బతుకమ్మ చీరల బకాయిలను ఎందుకు ఇప్పించలేదో సమాధానం చెప్పాలి. రూ,,240 కోట్లు బతుకమ్మ చీరలు బకాయిలు విడుదల చేయక పోవడం వల్ల వస్త్ర వ్యాపారులు అప్పుల పాలవుతున్నారు. అప్పులు తెచ్చి బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేశారు. ప్రభుత్వం రెండేళ్ల బకాయిలను రిలీజ్ చేయకపోవడం వల్ల నేతన్నలు ఇబ్బందుల్లో కోరుకుపోయారు.
రాష్ట్రంలో కొత్తగా కొలువుదిరిన కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల నేతన్న లను ఆదుకునేందుకు బతుకమ్మ చీరల బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
టెక్స్టైల్ పార్కు , సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బంధు పెట్టడం వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వెంటనే రాష్ట్ర సర్కారు నేతన్నల గురించి ఆలోచించి మూసివేసిన పరిశ్రమలను తెరిపించాలి. నష్టాల వల్ల గతంలో జరిగిన ఆత్మహత్యల వల్లే మళ్లీ ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ప్రభుత్వాలు తీసుకురావద్దు. సిరిసిల్ల నేతన్నలకు కొత్త ఆర్డర్ లు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం.