రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం..

0
104

-భూ భారతి చట్టం రైతులకు చుట్టం

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రైతును రాజుగా చేయడమే లక్ష్యముగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని, భూ భారతి చట్టం రైతులకు చుట్టమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం 2025పై అవగాహన సదస్సును మంగళవారం కోనరావుపేట మండలం నిజామాబాద్ లో నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలసి హాజరయ్యారు.

ఈ సందర్బంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భూ భారతి చట్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రుల సమక్షంలో చట్ట ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. కొన్ని రోజులుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమక్షంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.కొన్ని సంవత్సరాలుగా యాజమాన్య హక్కులు ఉన్న కని వాటిని మనం పొందలేక పోయామని అన్నారు.

గతంలో అసైన్ మెంట్ కమిటి ఉండేదని, ధరణి చట్టం తో  దానిని తొలగించారని,ధరణి చట్టానికి సరైన ప్రణాళికలు లేకుండా రూపొనిందించారని అన్నారు. తాత ముత్తాతలు కొన్న భూమిలును ధరణి వల్ల మళ్ళీ పాత వాళ్ళకే పట్ట ఉండటంతో రైతులు చాల ఇబ్బందులు ఎదురుకొన్నారని,పేద వారికి ఉపయోగపడే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసింది తమ ప్రభుత్వమని అన్నారు.

ప్రజా ప్రభుత్వంలో మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం,ఉచిత విద్యుత్,500 సిలిండర్లు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులకు ఏక కాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగిందని, దశాబ్దాల కల ఎస్సి వర్గీకరణ అమలు చేయడం జరిగిందని అన్నారు. ఇంకా కొన్ని కార్యక్రమలను అమలు చేసుకోవాలి త్వరలోనే వాటిని అమలు చేసుకుందామని, యువత కు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం అమలు చేస్తున్నామని, దీని ద్వారా సుమారు 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఎల్లయ్య, తహసిల్దార్ వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here