బలగం టీవి ,తంగళ్ళపల్లి
ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ భవనాన్ని ఆగ మేఘాల మీద ప్రారంభించారు. ఇటీవలె గ్రామ సర్పంచ్ అంకారపు అనిత భర్త రవీందర్ గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవం రావాలని మంత్రి సీతక్కను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాగా ఎమ్మెల్సీ కోడ్ వస్తుందని తెలిసి బుధవారం సాయంత్రం వేళలో నూతన గ్రామపంచాయతీ భవనం పూర్తికాకున్నా మధ్యలోనే ఎంపీపీ పడిగెల మానస, సర్పంచ్ ఆంకారపు అనిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం గ్రామస్తులకు ఎవరికి తెలియకపోవడంతో ఏమైనా లుసుగులు ఉన్నాయా లేక ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వస్తుందా అనుమానాలతో గుసగుసలాడుతున్నారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, అంకారపు రవీందర్, పూర్మని రామలింగారెడ్డి, వైద్య శివప్రసాద్, జలగం ప్రవీణ్, క్యారం జగత్, లక్ష్మారెడ్డి పరశురాములు, బాలకృష్ణ, మోర రాజు సామల రమేష్, శేఖర్ సత్యనారాయణ అనిల్, వార్డు సభ్యులు తదితరులుపాల్గొన్నారు.