శ్రీ మార్కండేయ ఫార్మసీ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహింపు..

0
90

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మార్కండేయ ఫార్మసీ (మెడికల్ షాప్) ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం రోజున ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి, భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా శ్రీ మార్కండేయ ఫార్మసీని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల మందులు ఎల్లప్పుడూ స్టాక్‌లో ఉండేలా చూసుకుని వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో శ్రీ మార్కండేయ ఫార్మసీ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు గెంట్యాల శ్యామల శ్రీనివాస్, వేముల రాములు, దుడం రజిని శ్రీనివాస్, బుర్ర నారాయణ గౌడ్, వెంగల లీలా లక్ష్మీనర్సు, ఎలుక వెంకటేశం, మంచె రేణుక శ్రీనివాస్, బత్తుల రమేష్, రిక్కమల్ల రజిత సంపత్ లు పాల్గొన్నారు.

అలాగే బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జిందం చక్రపాణి, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ చొప్పుదండి ప్రకాష్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ దుమాల శ్రీకాంత్, పుర ప్రముఖులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here