బలగం టివి ,
తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, మక్లూర్ మండల కేంద్రానికి చెందిన నిజాంపురం రాజేశ్వర్ (54) అనే కార్మికుడు జీవనోపాధి కోసం పొట్టచేత పట్టుకొని దుబాయి వచ్చి జీవనం గడుపుతున్న అతడు డ్యూటీ ముగించుకొని రూముకి వచ్చి సేద తీరుతున్న సమయంలో అతనికి ఆకస్మాత్తుగా గుండెపోటు రావటంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది…
ఇట్టి విషయాన్ని మృతుని మిత్రులు మరియు బంధువులు మన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ గారికి విషయం తెలియజేసి ఎలాగైన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని కోరిన వెంటనే స్పందించిన గుండెల్లి నరసింహ గారు ఇండియన్ కౌన్సిలేట్ అధికారులకు విషయం తెలియజేసి వారి అనుమతి తోటి బాడిని ఇండియా పంపించటానికోసమయ్యే పార్మలిటిస్ మరియు పేపర్ వర్క్ అంత దగ్గరుండి పూర్తి చేసి ఇండియన్ కౌన్సిలేట్ యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఎట్టకేలకు 26/01/2024 శుక్రవారం రోజున ఇండియా పంపించడం జరిగింది.
ఇట్టి విషయాన్ని మాకు తెలియజేసిన మృతుని బంధుమిత్రులు ప్రసన్న సోమిరెడ్డి గారు, సాయి రెడ్డి గార్లకు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి మృతుడి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.
SPECIAL THANKS TO:: COUNSULATE GENERAL OF INDIA (DUBAI (U.A.E)🙏🙏. AND SHARJAH POLICE 🙏🙏. AND DUBAI POLICE 🙏🙏.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని.. వారికి ఎక్స్గ్రేషియా అందించి చనిపోయిన వారి కుటుంబంలో అర్హత గల వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున డిమాండు చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండెల్లి నరసింహ గారు ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, మహిళ విభాగం ఇంచార్జ్ కోడి దుర్గ గారు, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ,కట్ట రాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ల రవీందర్, షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, నరేశ్ కూసరి, రఘుపతి పెంట, సందీప్ గౌడ్, రవి గౌడ్ పోతవేని, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, ఈరవేని రాము, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రికాయల శ్రీనివాస్,ఎండ్రికాయల శ్రీకాంత్, పెనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భూమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్ పటేల్, సాయి నంది, నరేష్ లింగంపల్లి,గుర్రపు రాము, సురేష్ శనిగారపు, ఎనగందుల శ్రీకాంత్, రమేశ్ కంపెళ్లి, రవీందర్ ఎగ్గే, బైరగోనీ మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్ పొన్నం, వెంకటేశ్, సాయి హర్ష, రామచంద్రం గౌడ్, రాజేష్ అర్దవేని, దావనపెల్లి గంగారం, కొత్తూరి సంతోష్, బెజ్జంకి అశోక్, చొప్పదండి రమేష్, ప్రశాంత్, అబ్దుల్ రహీం, రాజేందర్ జోగుల, చింతకుంట రాకేష్, గంగప్రసాద్, శెట్పల్లి రాజేందర్, సింగు రాజు మరియు సభ్యులు భాగస్వాములు అయ్యారు.
