ఎస్పీ అఖిల్ మహాజన్
బలగం టివి,సిరిసిల్ల:
నిరంతరం విధులు నిర్వహించే హోం గార్డ్స్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద వహించవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిరిసిల్ల అధ్వర్యంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా ఎస్పీ అఖిల్ మహాజన్ హజరై ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి మెగా వైద్య శిబిరాన్నిప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ. జిలాల్లో పని చేస్తున్న 198 హోం గార్డ్స్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత అని, రాత్రింబవళ్లు పని చేయడంతో పాటు ప్రతి రోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు.జిల్లాలో పని చేస్తున్న 198 హోం గార్డ్స్ సిబ్బందికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు లు,యోగ, క్రీడల నిర్వహిస్తున్నామని, ఇదివరకే జిల్లాలో పని చేస్తున్న హోం గార్డ్స్ కి ఆరోగ్య కార్డ్స్ అందజేయడం జరిగింది అన్నారు. పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు వైద్యుల సలహాలను పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలని. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో కలవని 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు ప్రతి మూడు నెలలకు ఒకసారైనా మన ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించి మందులు వాడే దానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి చంద్రయ్య,ఐఎంఏ అధ్యక్షుడు డా.గూడూరి రవీందర్ ,డా.విక్రమ్ ,డా,రాజేందర్,డా .యాదగరి గౌడ్,డా మోహన్ కృష్ణ, డా. శ్రీకాంత్, డా. లీలా శిరీష, డా. మంజూష, డా. గీతవాణిఎస్పీ గారి వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డాక్టర్స్ డా. గూడూరి రవీందర్ (ఐఎంఏ అధ్యక్షుడు), డా. కోడం విక్రమ్, డా. రాజేందర్ (ఆర్తో), డా. యాదగిరి గౌడ్ (ఈఎన్‌టీ), డా. మోహన్ కృష్ణ (ఈఎన్‌టీ), డా. శ్రీకాంత్ (కార్డియాలజిస్ట్), డా. లీలా శిరీష డా. వంశీ, డా. శివరామకృష్ణ డా. సాయి డా. శ్రవణ్ డాక్టర్. అభినవ్ & డాక్టర్ స్వామి),ఆర్.ఐలు రమేష్, యాదగిరి, మధుకర్,తదిదరులు పాల్గొన్నారు.