బలగం టీవీ, న్యూఢిల్లీ
కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రత బలగాలు?
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని టాంగ్‌మార్గ్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతుందని అధికారులు తెలిపారు.
టాంగ్‌మార్గ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందడంతో భద్రతా దళాలు ఆ ప్రాం తాన్ని చుట్టుముట్టాయని ఒక అధికారి తెలిపారు. అనుమానిత ప్రదేశాన్ని భద్రతా దళాల చుట్టు ముట్టడంతో.. లోపల దాక్కున్న ఉగ్రవాదులు దళాలపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా ఎదురు కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నా యని అధికారులు చెబు తున్నారు. పహల్గామ్‌లో పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది పౌరులను చంపి, అనేక మందిని గాయపరిచిన ఒక రోజు తర్వాత ఈ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరిగింది.
దాడి వెనుక పాకిస్తాన్ ప్రమేయం బయటపడింది
పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా బయటపడింది. అమాయక పౌరులను కాల్చి చంపింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే.. అంతేకాదు వాళ్లకు ఆదేశాలు కూడా పాకిస్తాన్ నుంచే వచ్చాయి.. హైబ్రిడ్ టెర్రరిస్టులతో పాకిస్తాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది. లష్కర్ స్లీపర్‌సెల్ TRF పహల్గామ్‌లో నరమేథం సృష్టించింది. 2024లో ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసిన ఉగ్ర వాదుల బ్యాచే పహల్గామ్ లో టూరిస్టులను ఊచకోత కోసింది. ఆ దాడి తరువాత సైలెంట్ ఉన్న ముష్కర మూక పహల్గామ్‌లో పంజా విసిరింది.
హైబ్రిడ్ టెర్రర్ బ్యాచ్‌లో సభ్యులపై నిఘా వర్గాల దగ్గర కచ్చితమైన సమా చారం లేదు. టార్గెట్‌ను ఫినిష్ చేసిన తరువాత ఈ బ్యాచ్ చాలా కాలం సైలెంట్‌గా ఉంటుంది. టీమ్ సభ్యులు విడిపోయి మళ్లీ కలుస్తారు..
ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉంటారు.. తరువాత పాకిస్తాన్ నుంచి ఆదేశాలు రాగానే మళ్లీ దాడులు మొదలుపెడు తారు.