బలగం టీవి, ఎల్లారెడ్డిపేట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో రంగ రంగ వైభవంగా శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణం నిర్వహించారు. బుధవారం రోజు ధనుర్మాస మహోత్సవాలను డిసెంబర్ 17 నుండి ఆదివారం 14 వరకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకులు నవీన్ చారి ఆధ్వర్యంలో అర్చకులు రంజిత్ కుమార్ నందు స్వామీ, గోపాల చారి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

శుక్రవారం ఉదయం 7-00 గంటలకు కూడారై 27వ పాశురం సందర్భంగా 108 గంగాళాలతో పాయసం ఉత్సవము ఎంతో వైభవంగా జరిపారు.అనంతరం పూలతో ప్రత్యేకంగా అలంకరించిన పెళ్లి పందిట్లో 10:30 గంటలకు విశ్వక్సేన పూజ,పుణ్యాహవచనం నీరాజన ,మంత్రపుష్పాలను , శాస్త్రోక్తంగా శ్రీ గోదాదేవి రంగనాథుల కల్యాణోత్సవం వేదమంత్రాలతో అంగ రంగ వైభవంగా జరిపారు.అనంతరం ఆలయ నూతన కమిటీ , గోదా గోష్టి భక్తబృందం, సనుగుల ఈశ్వర్ కృష్ణ భక్తి బృందం పోతు ఆంజనేయులు నారాయణ భక్తి బృందం సుమారు 1000 మందికి తీర్థ ప్రసాదాలు అన్నప్రసాధం వితరణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేయించి ఆలయకమీటీ వారు వారికి బహుమతులు అందజేశారు.
శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణోత్సవాన్ని ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు నంది కిషన్, మెగి నరసయ్య,ముత్యాల ప్రభాకర్ రెడ్డి, రామాగౌడ్,రమేష్,కిషన్, సంతోష్ చారి గుండాడి వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , సత్సంగ సదనం లక్ష్మమ్మ,గంట అంజమ్మ శ్యామ మంజుల, కాంగ్రెస్ పార్టీ నాయకులు దోమ్మాటి నరసయ్య, సద్ది లక్ష్మారెడ్డి , గుండాడి రామ్ రెడ్డి,పందిళ్ళ లింగం గౌడు, బుచ్చా గౌడ్,శ్రీ లక్ష్మీ కేశవ పెరుమళ్ళ ఆలయ కమిటీ చైర్మన్ పారి పెళ్లి,రామ్ రెడ్డి,బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, యమగొండా కృష్ణారెడ్డి,పారి పెళ్లి సంజీవరెడ్డి,లింగారెడ్డి మల్లారెడ్డి,బాల్రెడ్డి,లక్ష్మారెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.